సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువకాలం కొనసాగుతుంటారు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కొంతకాలం హీరోయిన్ లాగా కొనసాగిన తర్వాత అక్క, చెల్లి, వదిన లాంటి పాత్రలతో సరిపెట్టుకుంటుంటారు. అలాంటిది కొంతమంది హీరోయిన్లు మాత్రం రెండు జనరేషన్ల హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
• శ్రీదేవి
ప్రముఖ నటి శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరావు కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ప్రేమాభిషేకం’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలానే అక్కినేని నాగేశ్వరరావు కొడుకు అక్కినేని నాగార్జున నటించిన ‘గోవింద గోవింద’, ‘ఆఖరి పోరాటం’లాంటి సినిమాల్లో శ్రీదేవి నటించింది.
• తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి జంటగా నటించిన ‘ కెమెరా మ్యాన్ గంగతో రాంబాబుతో ‘ అనే సినిమాలో నటించారు. ఆ తరువాత తమన్నా, మెగా అబ్బాయి రామ్ చరణ్ తో కలిసి ‘రచ్చ’ సినిమాలో నటించింది. అలానే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహరెడ్డి ‘ సినిమాలో నటించింది.
• నయనతార
స్టార్ హీరోయిన్ నయనతార, నటసింహం బాలకృష్ణతో కలిసి సింహ, శ్రీరామ రాజ్యం సినిమాలో నటించింది. ఇక ఆ ఇంటి అబ్బాయి ఎన్టీఆర్ తో కలిసి ‘అదుర్స్ ‘ అనే సినిమాలో నటించింది.
ఇక కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కి జంటగా ‘మగధీర’ సినిమాలో నటించింది. అలానే చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి ‘ఖైదీ నెంబర్ 150’ లో కూడా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ నాగచైతన్యతో కలిసి ‘ రారండోయ్ వేడుక చూద్దాం’లో నటించింది. అలానే నాగార్జునకి జంటగా ‘మన్మధుడు 2’ లో నటించి మెప్పించింది. ఇలా కొంతమంది హీరోయిన్స్ తండ్రీకొడుకులతో యాక్ట్ చేసి ప్రేక్షకులను అలరించారు.