మ‌త్తు క‌ళ్ల‌తో మ‌తిపోగొడుతున్న మ‌హాన‌టి.. ఒక్క‌సారి వ‌ల‌లో ప‌డితే చిత్తు చిత్తే!

అందాల సోయ‌గం కీర్తి సురేష్ మంచి ఫామ్ లో ఉంది. ఇటీవ‌ల `ద‌స‌రా` మూవీతో ఈ మ‌ల‌యాళ కుట్టి బిగ్గెస్ట్ బ్లాక్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇందులో వెన్నెల పాత్ర‌లో అంద‌రి మ‌న‌సులు దోచేసింది. రీసెంట్ గా `మామన్నన్` మూవీతో మ‌రో బిగ్ హిట్ ను సొంతం చేసుకుంది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ఇందులో జంట‌గా న‌టించారు.

ఫహద్‌ ఫాజిల్‌, వడివేలు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మారి సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం త‌మిళనాట ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ‘నాయ‌కుడు’ పేరుతో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోషూట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

శారీని తలపించే విధంగా ఉన్న డిజైనర్ డ్రెస్ లో అందంగా ద‌ర్శ‌న‌మిచ్చిన మ‌హాన‌టి.. మ‌త్తు క‌ళ్ల‌తో మ‌తిపోగొట్టే విధంగా ఫోటోల‌కు పోజులిచ్చింది. విరహం ఒలకబోస్తూ అదరహో అనిపించింది. కీర్తి సురేష్ తాజా ఫోటోలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై నెటిజ‌న్లు `ఏం అందం రా బాబు.. ఒక్క‌సారి ఆమె వ‌ల‌లో ప‌డితే చిత్తు చిత్తే` అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, తెలుగులో కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా `భోళా శంక‌ర్‌` సినిమాలో న‌టించింది. వ‌చ్చే నెల‌లో ఈ మూవీ విడుద‌ల కాబోతోంది.