“జవాన్” సినిమా కోసం పెళ్ళైన నయన్ చేసిన పని తెలిస్తే..ఛీ ఛీ అంటారు..!!

సౌత్ ఇండియాలోని క్రేజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న నయనతారకు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక హిట్టు కూడా పడలేదు . అయితే నయనతార ఇప్పుడు తన ఆశలు అన్ని జవాన్ సినిమా పైన పెట్టుకొని ఉంది . అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే మరో హీరోయిన్గా నటిస్తూ ఉండగా .. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది.

స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతమైన యాక్షన్ గ్రాఫిక్స్ తో అద్భుతమైన సీన్స్ తెరకెక్కించిన అట్లీ ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ఫిక్స్ అయిపోయారు జనాలు . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టంబర్ ఏడవ తేది 2023న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం నయనతార చేసిన పని ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జవాన్ సినిమా షూటింగ్ టైం లో నయనతార పెళ్లి అయింది. అయితే నయనతార పెళ్లి అయిపోయిన మరుక్షణమే ఒక షెడ్యూల్ ఉండడం ..ఆ షెడ్యూల్ కాల్ షీట్స్ లో మిగతా నటీనటులు రెడీగా ఉండడం ..నయనతార ఒక్కటే హనీమూన్ కోసం చెక్కేస్తే వాళ్ళ కాల్ షీట్స్ వేస్ట్ అయిపోతాయి అన్న క్రమంలో నయనతార రిస్క్ చేసి మరి హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని సినిమా షూట్స్లో పాల్గొనిందట .

అంతేకాదు పెళ్లి తర్వాత దాదాపు నెల రోజులకి విగ్నేశ్ శివన్ తో టైం స్పెండ్ చేసే సమయం దొరికిందట . సినిమాల విషయంలో నయనతార అంత కమిట్మెంట్ గా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . అంతేకాదు పిల్లలు పుట్టిన తర్వాత కూడా జవాన్ సినిమా కోసం బిడ్డలని విగ్నేశ్ శివన్ కి అప్పగించి మరీ షూటింగ్ కంప్లీట్ చేసిందట .ఇది తెలుసుకున్న అభిమానులు ఛీ ఛీ అంటున్నారు . ఓ తల్లికి ముఖ్యం బిడ్డల భవిష్యత్తు ..బిడ్డల ఆరోగ్యం ..అది కూడా లెక్క చేయకుండా నువ్వు సినిమాలపై ఇంత ఇంట్రెస్ట్ చూపించావా ..?మరి నీకెందుకు పెళ్లి..? పిల్లలు..? అంటూ మండిపడుతున్నారు . మరో పక్క సినిమా ఇండస్ట్రీలో ఇంత కమిటెడ్ గల హీరోయిన్లు ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారు..!!