దేవర సినిమా కోసం జాన్వీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

దివంగత హీరోయిన్ శ్రీదేవి టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఇక ఈమె గారాల పట్టి జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అయినా సరైన సక్సెస్ ను అందుకోలేకపోతోంది కానీ అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. నార్త్ తో పోలిస్తే రెమ్యూనరేషన్ పరంగా సౌత్ లోనే బాగా అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తోంది.

Jr NTR to romance Janhvi Kapoor, details inside

సౌత్ లో స్టార్ హీరో తో గ్రాండ్ వెల్కమ్ దక్కిందని అభిమానుల సైతం తెగ ఆనందపడుతున్నారు. ముఖ్యంగా తనకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ తోనే జాన్వీ లాంచ్ కావడం జరిగింది. ప్రస్తుతం దేవర సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. బాలీవుడ్ కూడా సరైన సక్సెస్ అందుకోలేని ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో ఒక చిత్రానికి రూ.4 కోట్ల రూపాయలు పేమెంట్ అందుకుంటున్నట్లు సమాచారం. సౌత్ లో సరైన సక్సెస్ పడితే ఈ అమ్మడి రెమ్యూనరేషన్ కూడా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జాన్వీ కపూర్ దేవర సినిమా విడుదల విషయంపై చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్ తో తన తల్లి ఈమెను లాంచ్ చేయాలని చూసింది అయితే తన తల్లి లేకపోయినా సరే తన తల్లి అనుకున్న పనిని చేయడం జరుగుతోంది ఈ ముద్దుగుమ్మ. తన తల్లి కళ తన కల కూడా ఇన్ని రోజులకు నెరవేరిందని తెలియజేయడం జరిగింది జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.