క్లిన్ కారా కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న రామ్ చ‌ర‌ణ్ పెద్ద కూతురు.. వైర‌ల్ గా మారిన క్రేజీ పిక్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోట్ అవ్వ‌డంతో మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అలాగే తమ ముద్దుల కూతురుకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు.

ప్రస్తుతం బేబీ తో రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా క్లిన్ కారాకు సంబంధించి ఓ క్రేజీ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో క్లిన్ కారా కోసం రామ్ చరణ్‌ పెద్ద కూతురు నైట్ డ్యూటీలు చేస్తుంది. ఇంతకీ ఆ పెద్ద కూతురు ఎవరా అని అనుకుంటున్నారా రామ్ చరణ్ దంప‌తుల‌ పెంపుడు శున‌కం రైమ్‌. ఇది పూడిల్ జాతికి చెందిన శునకం. గ‌త కొన్నేళ్ల నుంచి రైమ్ ను రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న‌ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. వీరి దాన్ని వ‌దిలి క్ష‌ణ‌మైనా ఉండ‌లేరు.

రైమ్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఒళ్లోనే పెరిగింది. రామ్ చరణ్ విదేశాలకు వెళ్లినా రైమ్ ను వెంట తీసుకెళ్తాడు. రైమ్ ను త‌మ పెద్ద కూతురులా భావిస్తున్నారు. అన్న‌ట్లు రైమ్ పేరిట ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అందులో 67 వేల‌కు పైగా మంది ఫాలోవ‌ర్స్ కూడా ఉన్నారు అంటే రైమ్ ఎంత పాపులరో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే రైమ్ ఇన్‌స్టా అకౌంట్ లో ఓ ఫోటోను పోజ్ చేశారు. ఈ పిక్ లో రైమ్‌ ఉయ్యాలలో ఉన్న క్లిన్ కారాను తొంగి చూస్తూ క‌నిపించింది. ఇక ఈ పిక్ కు `నైట్ డ్యూటీ చేస్తూ తన చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను` అని ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ ను ఈ పిక్ తెగ ఆక‌ట్టుకుంటోంది. కానీ, ఇంత వ‌ర‌కు క్లిన్ కారా ఫేస్ ను రివీల్ చేయ‌క‌పోవ‌డం పట్ల మెగా ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తితో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rhyme Konidela (@alwaysrhyme)