‘భగవంత్ కేసరి’: కింద మీద ఊపు తెప్పించే అప్డేట్.. ఇక బాలయ్య అభిమానులను ఆపలేం రా బాబోయ్..!!

అసలే నందమూరి ఫ్యాన్స్ ఎంత హై రేంజ్ లో ..హై స్పీడ్ లో,, ఫాస్ట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మిగతా హీరోల ఫ్యాన్స్ తో కంపేర్ చేస్తే నందమూరి అభిమానులకు కూసింత ముందు స్టెప్ లోనే ఉంటారు అని అందరికీ తెలిసిందే . అలాంటిది నందమూరి బాలయ్యకు సంబంధించిన ఒక క్రేజీ రూమర్ నిజమైతే ఇక బాలయ్య అభిమానులను ఆపగలమా ..? అమ్మ బాబోయ్ తలుచుకుంటుంటేనే సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది .

నందమూరి బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమాలో బాలయ్య ఫ్లోర్ మూమెంట్ వేయబోతున్నాడు అని ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే ఫైనల్లీ అది నిజమే అంటూ క్లారిటీ వచ్చేసింది. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ నరసింహం గా పాపులారిటి సంపాదించుకున్న నందమూరి బాలయ్య – అనిల్ రాయపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తుంది . కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది . ఇక్కడ వేసిన భారీ సెట్ లోనే కాజల్ – బాలయ్య -శ్రీలీలపై ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారట మేకర్స్ .

అయితే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో బాలయ్య ఫ్లోర్ మూమెంట్ వేయబోతున్నాడు అంటూ ఓ ప్రచారం జరిగింది. ఫైనల్లీ అదే నిజమైంది . ఈ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్స్ లో తెరకెక్కుతున్న సాంగ్ లోనే బాలయ్య ఫ్లోర్ మూమెంట్ వేయబోతున్నాడట. దీనిపై ఇప్పటికే స్పెషల్ ఫోకస్ చేసిన అనిల్ రావిపూడి ఆయనతో డూప్ లేకుండా ఒరిజినల్ గాని ఫ్లోర్ మూమెంట్ వేయిస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న హీరోలు ఏ విధంగా బాడీ ఊపేస్తున్నారు తెలిసిందే. అలాంటి మూమెంట్లో ఇంత ఏజ్ వచ్చిన బాలయ్య డైరెక్టుగా డూప్ లేకుండా ఫ్లోర్ మూమెంట్ వేస్తూ ఉండడంతో బాలయ్య అభిమానులను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!