అవకాశాల కోసం ఏకంగా అలాంటి పని చేస్తున్న బన్నీ హీరోయిన్..!!

ఏ సినీ ఇండస్ట్రీలో నైన ఆఫర్లు వచ్చినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోవాలి.. లేకపోతే మళ్లీ అవకాశాలు కనుమరుగవుతాయి.. అందుచేతనే చాలామంది హీరోయిన్స్ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అస్సలు వదలకుండా కెరీర్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని ఆలోచించకుండా నటిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ కు నటించాలని కోరిక ఉన్నప్పటికీ అవకాశాలు రాక అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇలా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు బన్నీ హీరోయిన్ భాను శ్రీ మెహ్రా కూడా ఒకరు

Bhanushree Mehra Age, Family, Husband, Movies, Biography - Breezemasti

ఈమె మొట్టమొదటిగా వరుడు సినిమాలో నటించింది. కానీ అది కూడా డిజార్డర్ గానే మిగిలింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. అయితే ఈ అమ్మడు ట్విట్టర్ ద్వారా “నాకు అవకాశాలు ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతోందిభాను శ్రీ”. నన్ను ఉన్నపలంగా అల్లు అర్జున్ బ్లాక్ చేశారని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్విట్ కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది.

అయితే ఇప్పుడు భాను శ్రీమెహ్రా సినిమాలోకి తిరిగి రావాలని అలాగే ఎవరైనా అవకాశం ఇస్తే తన టాలెంట్ ని ప్రూవ్ చేస్తానంటూ ఎదురుచూస్తోంది .అయితే ట్విట్టర్ వేదికగా ఆమె తన గురించి కొన్ని విషయాలను తెలియజేసింది. సినిమా అవకాశాలు లేక ట్రావెలింగ్ చేస్తున్నానని సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా భాను శ్రీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఈమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో పలు వెకేషన్ లకి వెళ్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ వార్తలు విన్న తర్వాత తనకు ఎవరైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి మరి.