అంచనాలకు మించి.. సలార్ మూవీ టీజర్..!!

గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఆభిమానులు నిరాశపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తను నటించిన గత చిత్రాలన్నీ కూడా ఫ్లాపులు ఎదురయ్యాయి.అయితే ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ టీజర్ రానే వచ్చేసింది. కే జి ఎఫ్-1,2 తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ కనిపించిన మాస్ లుక్ ను మించి ఈ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

తాజాగా ఈరోజు ఉదయం ఈ టీజర్ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ తెప్పించే విధంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా థియేటర్లో విజిల్స్ పడేలా అనిపిస్తున్నాయని ప్రభాస్ ఆభిమానులు తెలియజేస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లోని ఈ చిత్రం ఇంటర్వెల్ ఒక మైలురాయిగా నిలుస్తుందని సమాచారం పూర్తిగా మాస్ యాక్షన్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర బృందం వేగంగా ప్లాన్ చేస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో మొత్తంగా 14 దేశాలలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే అన్ని దేశాలలో ఒకేసారి కాకుండా ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో విడుదల చేసినట్టు తెలుస్తోంది.ఇప్పటికే సోషల్ మీడియాలో #salar అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండిగా మారుతోంది. ఇప్పటివరకు ప్రభాస్ అంచనాలను మించి ఈ సినిమా ఉందని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.