NKR -21 చిత్రాన్ని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ని ప్రోత్సహించే హీరోలలో కళ్యాణ్రామ్ ముందువరుసలో ఉంటారు. ఎంతోమంది దర్శకులను సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత నందమూరి కుటుంబానికి దక్కిందని చెప్పవచ్చు.. కళ్యాణ్ రామ్ కూడా ఎంతోమందిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు.

అలా ఎలా అనే ఒక ఫీల్ గుడ్ మూవీని నిర్మించిన అశోక్ క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన కూడా కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అత్యధిక బడ్జెట్ తో నిర్మించాలని ఆకాంక్షతో వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ సినిమా అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించి తారాగణం సాంకేతిక నిప్పునుల గురించి త్వరలోనే అనౌన్స్మెంట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు

కళ్యాణ్ రామ్ తన పంచ్ పవర్ ను చూపించే విధంగా ఒక మాస్ అప్పియర్ తో ఒక పోస్టర్ని సైతం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం.కళ్యాణ్ రామ్ మునుపెన్నడు చూడని విధంగా ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ప్రాజెక్ట్ ఇదే అని చెప్పవచ్చు. మరి ఇందుకు సంబంధించి ఈ పోస్టల్ మాత్రం వైరల్ గా మారుతోంది.