ఎన్టీఆర్ `దేవ‌ర‌`లో అల్లు అర్హ‌.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం `దేవ‌ర‌` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. హైద‌రాబాద్ లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

వ‌చ్చే ఏడాది ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దేవ‌ర పై అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియులంద‌రినీలో మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌పోతే ఈ సినిమా అల్లు అర్జున్ ముద్దులు కూతురు అల్లు అర్హ న‌టించ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జాన్వీ క‌పూర్ చిన్ననాటి పాత్ర‌ను అర్హ పోషిస్తుంద‌ట‌. అర్హ పాత్ర‌కు స్క్రీన్ టైమ్ దాదాపుగా ప‌ది నిమిషాల ఉంటుంద‌ట‌.

వ‌చ్చే నెల‌లో అర్హ పాప దేవ‌ర షూటింగ్ లో కూడా జాయిన్ కాబోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ మూవీకి అర్హ అందుకుంటున‌న్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, ప‌ది నిమిషాల పాత్ర కోసం ఆమె రూ. 20 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ట‌. అంటే నిమిషానికి రెండు ల‌క్ష‌ల‌న్న‌మాట‌. కొత్త హీరోయిన్లు త‌మ డెబ్యూ మూవీకి కూడా ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకోరు. కానీ, బ‌న్నీ కూతురు అనే ఇమేజ్ వ‌ల్ల అర్హ ఆ రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటుంది. అన్న‌ట్లు అర్హ ఇప్ప‌టికే శాకుంతలం మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా అల్లు అర్హ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంసలు ద‌క్కాయి.