నిహారిక కోసం కేక్ తెప్పించిన హీరో సుమంత్ అశ్విన్.. అతడి కామెంట్స్ వైరల్!

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను సుమంత్ ప్రొడక్షన్ బ్యానర్ వారే ప్రేక్షకులకు అందించారు. ఈ ప్రొడక్షన్ ద్వారా నిర్మాత ఎంఎస్ రాజు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నా ఆయన కొడుకుని మాత్రం ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబెట్టలేకపొయ్యారు. ‘తూనీగ తూనీగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సుమంత్ అశ్విన్. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఆ తర్వాత సుమంత్ అశ్విన్ నటించిన సినిమాలేవీ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మెగా డాటర్ నిహారిక, సుమంత్ అశ్విన్ కలిసి జంటగా నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా కూడా ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ అశ్విన్ హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను అందరితో పంచుకున్నాడు. మెగా డాటర్ నిహారిక షూటింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన చుట్టూ ఉండే వారిని కూడా యాక్టివ్ గా ఉండేలా చేస్తుందట.

నిహారిక ఒక స్టార్ కిడ్ అనే గర్వం లేకుండా అందరితో సరదాగా మాట్లాడుతుందని, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందని సుమంత్ అశ్విన్ తెలిపాడు. ఇక హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే నిహారిక పుట్టినరోజు వచ్చిందట. దాంతో ఆమె బర్త్‌డేని సెలబ్రేట్ చేయడానికి తన కజిన్ చెన్నై నుంచి వస్తుండగా, అక్కడినుండి నిహారిక కోసం ప్రత్యేకమైన కేక్ ని తెప్పించానని, నిహారిక బర్త్ డే ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశామని ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.