అల్లు అర్జున్ వ‌ల్లే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయ్యాడ‌ని మీకు తెలుసా?

అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గీత గోవిందం మూవీతో ఆ స్టార్డ‌మ్ ను పటిష్టం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన స‌రైన హిట్‌ పడలేదు. గ‌త ఏడాది విజ‌య్ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయినా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయ్యాడు అంటే అందుకు ప‌రోక్షంగా అల్లు అర్జునే కార‌ణమ‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ `అర్జున్ రెడ్డి ` నిజానికి అల్లు అర్జున్ చేయాల్సింద‌ట‌. డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా మొద‌ట ఈ స్టోరీని ఆయ‌న వ‌ద్ద‌కే తీసుకెళ్లాడ‌ట‌. అయితే క‌థ న‌చ్చినా.. ఏదో కార‌ణాల‌తో తిర‌స్క‌రించాడ‌ట‌.

ఆ మూవీనే విజ‌య్ కు లైఫ్ ఇచ్చింది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `గీతా గోవిందం`కు కూడా ఫ‌స్ట్ ఛాయిస్ బ‌న్నీనే. ప‌రుశురామ్ గీతా గోవిందం క‌థ‌తో అల్లు అర్జున్ వ‌ద్ద‌కు డేట్స్ ఖాళీగా లేవ‌ని చెప్పి రిజెక్ట్ చేశాడు. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ‌లోకి వ‌చ్చాడు. అర్జున్ రెడ్డిలో హై ఓల్టేజ్ యాటిట్యూడ్ చూపించిన విజ‌య్‌.. గీత గోవిందంలో సాఫ్ట్ కుర్రాడిలో ఒదిగిపోయి న‌టించాడు. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం విజ‌య్ స‌మంత‌తో క‌లిసి చేసిన `ఖుషి`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. మ‌రోవైపు గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ మూవీ, ప‌రుశురామ్ తో ఓ మూవీకి క‌మిట్ అయ్యాడు.