ఇలియానా ప్లాన్ అదేనా.. అందుకే బాయ్ ఫ్రెండ్ ను చూపించ‌కుండా దాచేస్తుందా?

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇలియానాకు నెలలు కూడా నిండాయి. మరి కొద్ది రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే ఇలియానాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. అయినా సరే ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచుకుండా కొద్ది నెలలు క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

ఇక‌పోతే ఇలియానాను తల్లిని చేసిన వ్యక్తి ఎవరు అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ఓ రెస్టారెంట్లో బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఓ స్టిల్ ను ఇలియానా రిలీజ్ చేసింది. కానీ, అందులో ఆమె ప్రియుడి ముఖం మాత్రం కనిపించలేదు. తాజాగా మరో పోస్ట్ పెట్టింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి గడిపిన ఓ మధుర క్షణాన్ని ఆమె బయటపెట్టింది.

`నేను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఈ మనోహరమైన వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చాడు. నాకు అండ‌గా నిలిచాడు. నా కన్నీళ్లు తుడిచాడు. నన్ను నవ్వించడానికి జోకులేశాడు. నన్ను అక్కున చేర్చుకున్నాడు. త‌న ప్రేమ‌ను చాటుకున్నాడు` అంటూ ఇలియానా ఈ సంద‌ర్భంగా ప్రియుడి గురించి గొప్ప‌గా చెప్పుకొచ్చింది. కానీ, ట్విస్ట్ ఏంటంటే.. ఇలియానా తాజా పోస్ట్ లోనూ ఆమె బాయ్ ఫ్రెండ్ ముఖం అస్ప‌ష్టంగానే ఉంది. అయితే ప్రియుడిని చూపించ‌కుండా ఇలియానా దాగుడుమూత‌లు ఆడ‌టానికి ఓ కార‌ణం ఉంద‌ట‌. ఇలియానా త‌న బిడ్డ‌ను మ‌రియు బిడ్డ‌కు తండ్రిని ఒకేసారి ఈ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌ని ప్లాన్ చేసుకుంద‌ట‌. అందుకే బాయ్ ఫ్రెండ్ ను చూపించ‌కుండా దాచేస్తుంద‌ని టాక్ న‌డుస్తోంది.