Villan:ఎన్టీఆర్ ని విలన్ గా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

బాలీవుడ్ లో భారీ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా రాబోతోంది వార్ -2 ఎన్టీఆర్ బాలీవుడ్ లో మొదటిసారిగా లాంచ్ కాబోతున్నారు ఈ చిత్రంతో.. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ రోల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికి యుద్ధ భూమిలో ఎదురు చూస్తున్నట్లుగా హృతిక్ రోషన్ కూడా ట్వీట్ చేస్తూ అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ మల్టీస్టారర్ గా పరిగణిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు.. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ సినిమా లో అసలు ట్విస్ట్ ఏంటి అన్న విషయం తెలిస్తే ఎన్టీఆర్ అభిమానులు షాక్ అవ్వక తప్పదు..

War 2: If Jr. NTR Had Declined To Star Opposite Hrithik Roshan, YRF Had  Options From Hindi Film Industry & Not South, Here's How It Was Planned!
ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ హీరోగా కాకుండా విలన్ గా నటించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రతి నాయకుడిగా ఎన్టీఆర్ అయితే పక్కాగా సూట్ అవ్వడంతో పాటు నటన పరంగా ఆ పాత్రకు న్యాయం చేయగలరనే విషయాన్ని నమ్మి దర్శకనిర్మాతలు ఎన్టీఆర్ ని ఒప్పించినట్లు సమాచారం. విలన్ రోల్ అయిన హీరో పాత్రకు దీటుగా ఎన్టీఆర్ ఉంటారనే వార్త వైరల్ గా మారుతోంది.

వార్ -2 లో పలు రకాల వేరియేషన్ షేర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చెప్పాలంటే హీరో పాత్ర కంటే తెరపైన గొప్పగా ఈ పాత్ర పండుతుందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఒకవేళ ఎన్టీఆర్ పోషించేది నెగిటివ్ రోల్ అయితే ఆయన అభిమానులు ఎలా తీసుకుంటారు అనే విషయంపై ఇప్పుడు పెద్ద సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. గతంలో జై లవకుశ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ ఉన్నప్పటికీ స్టోరీ పరంగా బాగుండడంతో హైలైట్ గా మారిపోయారు. మరి వార్ -2 చిత్రంలో ఎలా ఉంటుందో చూడాలి.