ఇదేంది.. భార్యపై కోపంతో దానిపై ప్రతాపం చూపిన వరుణ్ సందేశ్..

హ్యాపీ డేస్ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ ఎన్నో సినిమాల్లో హీరోగా చేశాడు కానీ అతను స్టార్ హీరో స్థాయికి ఎదగలేకపోయాడు. ఈ హీరో 2023లో మైకల్ అనే ఒక సినిమా చేశాడు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించాడు. ఇప్పుడు యద్భావం తద్భవతి సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ హీరోయిన్ కెరీర్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ విషయాలే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఈ హీరో మరోసారి తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించి వార్తల్లో నిలుస్తున్నాడు.

తాజాగా ఒక షోలో పార్టిసిపేట్ చేసిన వరుణ్ సందేశ్ తన సతీమణి వితికా షెరు గురించి ఎవరికీ తెలియని వివరాలు పంచుకున్నాడు. తన వైఫ్ తన బ్రష్ ను ఎప్పుడూ వాడుకుంటుందని అది తనకు అస్సలు నచ్చదని వరుణ్ సందేశ్ పేర్కొన్నాడు. వితిక, తాను కలిసిన నటించిన సినిమాతో తమ మధ్య పరిచయం ఏర్పడిందని, అది ప్రేమకు దారి తీసింది అని ఈ హీరో తెలిపాడు. మలేషియాకు వెళ్లిన సమయంలో వితికతో తాను లవ్‌లో పడినట్లు కూడా వెల్లడించాడు. తాను ప్రపోజ్ చేసిన సమయం నుంచి వితిక తన ఫ్యామిలీతో మాట్లాడటం మొదలుపెట్టిందని చెప్పాడు.

ఈ హీరో ఇంకా మాట్లాడుతూ.. “న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో సహా నేను వేగాస్‌కు వెళ్లాను. అదే సమయంలో వితిక కూడా అక్కడికి వచ్చింది. మా ఫ్యామిలీ అందరి ముందు నన్ను కలిసి సర్‌ప్రైజ్ చేసింది. తనకు సర్‌ప్రైజ్‌లు చేయడం అంటే చాలా ఇష్టం. వాటిని బాగా ప్లాన్ చేస్తుంది కూడా. గతంలో ఒకసారి నాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను వితిక నా అనుమతి లేకుండానే షేర్ చేసింది. ఆ వీడియో మరీ టూ మచ్‌గా ఉంటుంది. దానిని షేర్ చేసిందని తెలిసి నాకు బాగా కోపం వచ్చింది. అంత కోపం వచ్చినా వితికను ఏమీ అనలేదు. కాకపోతే ఆ కోపం తగ్గించుకునేందుకు ఒకసారి మైక్రో వేవ్ ను పగలగొట్టా” అని అన్నాడు. అయితే ఇది విన్నా కామెంట్స్ అయ్యో పాపం అని అంటున్నారు. భార్య మీద చూపించలేని ప్రతాపం దానిపై చూపించావా వరుణ్ అంటూ మరి కొందరు సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.