ప్రభాస్ హీరో అని తెలిసి.. కధ నచ్చినా “ఆది పురుష్” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. హీరోయిన్గా కృతి సనన్ నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్టుగా టాక్ నమోదు చేసుకుంది . సూపర్ డూపర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది . రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ ని అందుకుని.. సినీ ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది .

దీంతో సోషల్ మీడియాలో ఆది పురుష్ సినిమాకి సంబంధించిన ఫొటోస్ , టాక్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆది పురుష్.. సినిమాలో మొదటి హీరోయిన్ గా అనుకున్నా ముద్దుగుమ్మ పేరు ట్రెండ్ అవుతుంది . నిజానికి ఓం రావత్ ఈ సినిమాలో హీరోయిన్గా సీత పాత్ర కోసం అలియా భట్ ను చూస్ చేసుకున్నారట . అలియా భట్ కూడా సీత పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

అయితే ఎప్పుడైతే సినిమాలో హీరో ప్రభాస్ అని తెలిసిందో అప్పుడే హీరోయిన్ అలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకుందట . మొదటి నుంచి హీరో ప్రభాస్ బాడీకి ..తన స్టామినా కి తన ఫిగర్ మ్యాచ్ కాదు అంటూ అలియాభట్ ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఇంత మంచి పాత్రను మిస్ చేసుకున్న అలియా భత్ పై ఫైర్ అవుతున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో అలియా భట్ పేరు వైరల్ గా మారింది..!!