Brecking: గుండెపోటుతో కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..!!

తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గత కొన్ని నిమిషాల ముందు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విజయనగరం నుంచి వస్తూ ఉండగా రాకేష్ మాస్టర్ కు గుండెపోటు వచ్చినట్టుగా తెలుస్తోంది దీని వలన రక్త విరోచనాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Controversial Choreographer Rakesh Master Creating Ruckus
చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూసినట్టు తెలుస్తోంది .ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్న రాకేష్ మాస్టర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆట డాన్స్ షో తో తన కెరీర్ను ప్రారంభించిన రాకేష్ మాస్టర్ దాదాపుగా 1500 సినిమాలకు పైగా పని చేశారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్నారు.. సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటారుతన కెరీర్ను చాలామంది డాన్స్ మాస్టర్లు నాశనం చేశారంట యూట్యూబ్లో చెప్పి మంచి పాపులారిటీ సంపాదించారు.

రాకేష్ మాస్టర్ మాట్లాడిన ప్రతి మాట కూడా వైరల్ గా మారుతూ ఉండేది యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆట షో గురించి డాన్స్ షో ల గురించి ఇష్టం వచ్చినట్లు తెలియజేయడంతో రాకేష్ మాస్టర్కు మతిస్థిమితం లేకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నారని రూమర్లను కూడా సృష్టించారు. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది. ఈయన అభిమానులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.