రూ.200కోట్లు రాబట్టిన హీరోయిన్.. అయినా కూడా అవకాశాలు నీల్..!!

తెలుగులో మొదటి సారి హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ఆదాశర్మ.. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి చిత్రాలలో నటించింది.తను నటించిన మొదటి చిత్రంలోని గ్లామర్ తో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది గత కొన్ని సంవత్సరాలుగా ఆదాశర్మ అడప దడపా సినిమాలలో నటిస్తోంది. పలు రకాల ఐటెం సాంగ్లలో కూడా అలరిస్తూనే ఉన్నది.కానీ ఇప్పటివరకు ఈమె స్టార్ డం మాత్రం అందుకోలేక పోతోంది. దీంతో ఆదాశర్మకు అవకాశాలు రావడమే చాలా గగనంగా మారిపోయింది.

Happy Birthday Adah Sharma: Here are some lesser-known facts about 'The  Kerala Story' actress
ఇలాంటి సమయంలోనే అనొహ్యంగా ది కేరళ స్టోరీ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఒక హిందూ అమ్మాయిని మతం మార్పించి ఎలా ఉగ్రవాదంలోకి దించారు అనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇందులోని నటన ఆదాశర్మకు అద్భుతంగా కలిసొచ్చింది అని చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఆదాశర్మ వావ్ అనిపించే నటనను ప్రదర్శించింది.. ఆకట్టుకునే అందంతో ఉన్నప్పటికీ గతంలో స్కిన్ షో చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఆదాశర్మ.

కేరళ స్టోరీ సినిమాతో దాదాపుగా ఈ సినిమా రూ .250 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఆదాశర్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ తెలుగు ఫిలిం మేకర్స్ మాత్రం ఇమెను పెద్దగా పట్టించుకోవడం లేదు.మళ్లీ ఆఫర్ల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక ముందు అయినా ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమాల అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి. గతంలో చిన్న హీరోల సినిమాలలో కూడా నటించింది ఆదాశర్మ. ఈమధ్య అలాంటి ఆఫర్లు కూడా రాలేదు.