న‌య‌న‌తార బ్యూటీ సీక్రెట్ లీక్‌.. భ‌ర్త‌తో రోజుకు 2 గంట‌లు అదే ప‌నట‌!

సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయాలు అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అగ్ర హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుని సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా స‌త్తా చాటుతున్న‌ నయనతార.. గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివ‌న్ తో ఏడడుగులు వేసింది.

 

దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి జరిగిన నాలుగు నెలలకే స‌రోగ‌సి పద్ధతిలో నయనతార ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఈ అమ్మడు ఫుల్‌ బిజీగా ఉంది. అయితే వయసు 40కి చేరువవుతున్న నయనతార అందం మాత్రం చెక్కుచెదరలేదు. అప్పటికి ఇప్పటికీ అదే అందాన్ని, ఫిట్‌నెస్ ను మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

అయితే తాజాగా నయనతార బ్యూటీ సీక్రెట్ లీక్ అయింది. లేటు వయసులోనూ నయనతార సూపర్ ఫిట్ గా ఉండడానికి నిత్యయ‌వ్వ‌నంగా మెరిసిపోవడానికి కారణం ఉందట. నయనతార ప్రతి రోజు తన భర్తతో కలిసి కనీసం రెండు గంటల పాటు యోగా చేస్తుండట. అలాగే మంచి డైట్ ను ఫాలో అవుతుందట. డైట్ లో కొబ్బరి నీళ్లు, పళ్ళ రసం తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుందట. లంచ్‌లో కూరగాయలు, నాన్ వెజ్, గుడ్డు సమపాళ్ల‌లో తీసుకుంటుంద‌ట. కార్బోహైడ్రేట్స్ ను కంప్లీట్ గా ఎవైడ్‌ చేస్తుందట. ఇక కచ్చితంగా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతుందట. వీటివల్లే నయనతార ఇప్పటికీ ఎంతో అందంగా ఫిట్ గా ఉండ‌టానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.