చిన్న వయసులోనే ప్రేమలో పడ్డ హీరోయిన్లు.. అప్పుడు ఏమైందంటే

ప్రేమలో పడని వారు, వర్షంలో తడవని వారు ప్రపంచంలో ఉండరు అనే సామెత ఉంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. ముఖ్యంగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరొందిన హీరోయిన్లు కూడా తాము చిన్నతనంలో ప్రేమలో పడ్డామని, తల్లిదండ్రులకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. వారిలో కొందరిని తల్లిదండ్రులు మందలించి వదిలేయగా, మరికొందరు తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. ఇలాంటి వారిలో అగ్ర హీరోయిన్లు కూడా ఉన్నారు దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీకి తెలుగులోనూ ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు. తెలుగులో ఆమె భరత్ అను నేను, వినయ విధేయ రామ అనే సినిమాలు చేసింది. ఇక ఆమె ఇటీవల బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లాడింది. వారి పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో బిజీగా మారింది. ఇక ఆమె ఫస్ట్ లవ్ సిద్ధార్థ్ మాత్రం కాదట. ఆమె ఇంటర్‌లోనే ఓ అబ్బాయిని విపరీతంగా ప్రేమించిందట. ఈ విషయం ఇంట్లో తెలిసి పెద్ద రచ్చ అయిందట. ఆ తర్వాత ఆమెను కాలేజీ మార్పించేసినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగానే కాకుండా సొంతంగా తనకు ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్. ఆమె కూడా 15 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడిందట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం స్వయంగా ఆమె వెల్లడించింది. ఇక సమంత విషయానికొస్తే ఆమె ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ మకాం మార్చింది. ఓ హాలీవుడ్ సినిమా కూడా చేయనుంది. సమంత కూడా ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. చదుకునే టైమ్ లో ఒక అబ్బాయిని ప్రేమించానని, అయితే అతడికి ఎలా తన ప్రేమ విషయం చెప్పాలో తెలియలేదని పేర్కొంది. చెప్పే ధైర్యం లేక ప్రేమ విషయం తనలోనే దాచుకున్నట్లు వెల్లడించింది.