ఊర్వశి రౌతేలా ధ‌రించిన ఆ నైట్ డ్రెస్ అంత కాస్ట్లీనా.. ఐటెం పాప బాగా రిచ్ రోయ్‌!

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత బాలీవుడ్ లో న‌టిగా మారిన అందాల భామ ఊర్వశి రౌతేలా.. ప్ర‌స్తుతం ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ కుర్ర‌కారును ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఆ మ‌ధ్య‌ వాల్తేరు వీర‌య్య‌, ఏజెంట్ చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సాయి ధ‌ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `బ్రో` మూవీలో ఆడిపాడేందుకు క‌మిట్ అయింది.

అలాగే రామ్ పోతినేని, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రంలోనూ ఊర్వశినే ఐటెం నెంబ‌ర్ గా అల‌రించ‌బోతోంది. ఇక‌పోతే ఊర్వశి తన లగ్జరీ లైఫ్ స్టైల్ ఇటీవల తరచూ హెడ్‌లైన్స్ లో నిలుస్తోంది. రీసెంట్ గా సుమారు రూ.190కోట్లతో పెద్ద బంగ్లాను కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇప్పుడు ఈ అమ్మ‌డు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఈ బ్యూటీ తాజాగా ఎయిర్‌ పోర్ట్ లో మెరిసింది. ఈ సంద‌ర్భంగా ఆమె పింక్‌ డ్రెస్‌ ధరించింది. చూడ్డానికి అచ్చం నైట్ డ్రెస్ లానే ఉన్నా.. ఈ డ్రెస్ ఖ‌రీదు తెలిస్తే షాకైపోతారు. చాలా కాజ్వల్‌గానే ఉన్న ఈ డ్రెస్ రూ.91వేలు అట. అంటే దాదాపుగా ల‌క్ష రూపాయిలు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు `నైట్ డ్రెస్ కోస‌మే అంత ఖ‌ర్చు చేసిందా..ఐటెం పాప బాగా రిచ్ రోయ్..` అంటూ కామెంట్లు చేస్తున్నారు.