జిమ్‏లో క‌ళ్లు చెదిరే రేంజ్ లో జ్యోతిక కసరత్తులు.. వైర‌ల్ గా మారిన సూర్య రియాక్ష‌న్‌!

న‌టి జ్యోతిక గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. షాక్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. చంద్రముఖి మూవీతో స్టార్ హోదాను అందుకుంది. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తెలుగులో పాటు త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ న‌టించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే కోలీవుడ్ స్టార్ సూర్య‌తో ఏడ‌డుగులు వేసింది.

పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూర‌మైన జ్యోతిక నిర్మాతగా రాణిస్తూ వ‌చ్చింది. అలాగే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్ల‌లు పెద్ద వారు కావ‌డంతో.. జ్యోతిక ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసింది. త‌న వ‌య‌సుకు త‌గ్గా పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఇక‌పోతే జ్యోతిక ఈ మ‌ధ్య బాగా స‌న్నబ‌డింది. ఇందుకోసం ఆమె జిమ్ లో గ‌ట్టిగానే క‌స‌ర‌త్తులు చేస్తోంది.

తాజాగా జ్యోతిక వ‌ర్కౌట్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో జ్యోతిక క‌స‌ర‌త్తులు చూస్తే క‌ళ్లు చెద‌రాల్సిందే. జ్యోతిక క‌ఠిన‌మైన క‌స‌ర‌త్తుల‌ను చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే జ్యోతిక క‌స‌ర‌త్తుల‌పై ఆమె భ‌ర్త సూర్య కూడా రియాక్ట్ అయ్యాడు. `మై వండర్ ఉమెన్` అంటూ ఇన్‌స్టా స్టోరీస్ లో జ్యోతిక జిమ్ చేస్తోన్న ఫోటోను షేర్ చేశారు. కాగా, జ్యోతిక‌ `దళపతి 68` చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతోంది. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ ఓ థ్రిల్ల‌ర్ మూవీకి క‌మిట్ అయింది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్ లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

https://www.instagram.com/reel/CtzBdK6JjFr/?utm_source=ig_web_copy_link