ఫైనల్లీ.. పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..అబ్బాయి ఎంత రిచ్ అంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలు హీరోయిన్లు బడా బడిగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి స్టార్ ప్రముఖులు అంతా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోగా …రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠిలో కూడా నిశ్చితార్థం చేసుకుని పెళ్లి తో ఒకటి కాబోతున్నారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై కొందరు స్టార్స్ కూడా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న మలయాళీ బ్యూటీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ కూడా పెళ్లి చేసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం .. హీరోయిన్ నిత్యామీనన్ త్వరలోనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోబోతుందని ..తల్లిదండ్రుల ఫోర్స్ చేసిన కారణంగానే కొన్నాళ్లు పెళ్లి వద్దు అనుకున్న నిత్యామీనన్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వీళ్ళని నిశ్చితార్ధానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. నిశ్చితార్ధం తర్వాత అఫీషియల్ గా పెళ్లి గురించి మీడియా ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని చెప్పడానికి సిద్ధమవుతుంది నిత్యమీనన్ అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యామీనన్ పెళ్లి వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది . అంతేకాదు నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోయే భర్త బాగా డబ్బు ఉన్న వాడని.. ఆయన బిజినెస్ పరంగా నెంబర్ వన్ అని.. కోట్ల ఆస్తికు వన్ అండ్ ఓన్లీ సన్ అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే నిత్యామీనన్ పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా ..? చేయదా..? అని అభిమానులు ఆలోచిస్తున్నారు..!!