తన ఫ్రెండ్ ని బాలయ్య ఎలా సర్ప్రైజ్ చేసారో చూడండి..నందమూరి బిడ్డ అని ప్రూవ్ చేసాడుగా..!!

గ్లోబల్ లైన్ గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే . నందమూరి తారక రామారావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రెసెంట్ స్టార్ హీరోలలో ఒకరుగా రాజ్యమేలేస్తున్నారు . కాగా బ్యాక్ టు బ్యాక్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెడుతున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే మెగా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు .

ఈ సినిమా అయిపోగానే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాకి ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే ఓవైపు సినిమా షూట్ లో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి టైం స్పెండ్ చేస్తున్నారు బాలయ్య. రీసెంట్గా బాలయ్య తన ట్రావెల్ ఫ్రెండ్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఫ్రెండ్ గృహప్రవేశానికి చెప్పకుండా వెళ్లి అక్కడ ఉన్న వారిని సర్ప్రైజ్ చేశారు . దీంతో దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

కాగా బాలయ్య ఓ రోజు ఫ్లైట్లో ప్రయాణిస్తున్న క్రమంలో పక్కనే కూర్చున్న హరీష్ వర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు . ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిపోయింది . అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుని మాట్లాడుకునే వారు బాలయ్య – హరీష్ వర్మ . మాటల్లో ఓ సందర్భంలో గృహప్రవేశం ఉంది అంటూ చెప్పుకొచ్చారట. అంతే ఎవరికి చెప్పకుండా బాలయ్య గృహప్రవేశానికి హాజరై అక్కడ ఉన్నవారికి సర్ప్రైజ్ చేశారు. దీనితో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి . ఏది ఏమైనా సరే బాలయ్య ఇలా చేయడం నందమూరి అభిమానులకు కూడా బాగా నచ్చేసింది . దీనితో నందమూరి బిడ్డ అంటే అదే.. ఆ క్వాలిటీ ఎప్పుడు నందమూరి హీరోలలో ఉంటుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!!