ఎన్టీఆర్ త‌న‌యుడు భార్గవ్ రామ్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా.. తార‌క్ మాత్రం కాదు!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర‌` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా చేస్తున్నాడు. హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఎన్టీఆర్ కు ఇద్ద‌రు త‌న‌యులు అన్న విష‌యం విధిత‌మే. పెద్ద కుమారుడు అభయ్ రామ్ కాగా చిన్న కుమారుడు భార్గవ్ రామ్. ఎన్టీఆర్ కు ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో.. ఆయ‌న వార‌సుల‌కు కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. అయితే నేడు చిన్నోడు భార్గ‌వ్ రామ్ పుట్టిన రోజు కావ‌డంతో.. అభిమానులు, పలువురు ప్రముఖులు లిటిల్ యంగ్ టైగ‌ర్‌ కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దీంతో సోషల్ మీడియాలో ఉద‌యం నుంచి భార్గవ్ రామ్ ట్రెండింగ్ లో ఉన్నాడు. అలాగే భార్గ‌వ్ రామ్ కు సంబంధించి ప‌లు విష‌యాలు కూడా తెర‌పైకి వ‌స్తున్నారు. అచ్చం ఎన్టీఆర్ పోలికలతో ఉండే భార్గ‌వ్ రామ్ ఫేవ‌రెట్ హీరో ఎవ‌రో తెలుసా..? సాధార‌ణంగా ఒక స్టార్ హీరో పిల్లలకు తన నాన్న ఫేవరెట్ గా ఉంటారు. కానీ, భ‌ర్గ‌వ్ రామ్ ఫేవ‌రెట్ హీరో తార‌క్ మాత్రం కాదండోయ్‌. ఈ లిటిల్ యంగ్ టైగ‌ర్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మ‌హా ఇష్ట‌మ‌ట‌. అల్లు అర్జున్ సినిమాలే ఎక్కువ‌గా చూస్తాడ‌ట‌. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో పుష్ప సినిమాను భార్గ‌వ్ అనేక సార్లు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా వెల్ల‌డించాడు.