రామ్ చ‌ర‌ణ్ కూతురుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. బాబాయ్‌-అబ్బాయ్ అనుబంధానికి ఇదే నిద‌ర్శ‌నం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు.

అలాగే కొణిదెల మరియు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ననే రామ్ చరణ్ కూతురును చూసొచ్చారు. కానీ రామ్ చ‌ర‌న్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం హాస్ప‌ట‌ల్ కు వెళ్లలేక పోయారు. అందుకు కారణం తెలిసిందే. వారాహి విజయయాత్రలో బిజీగా ఉండడం వల్ల ఆయన సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ దంపతులకు విషెస్ తెలిపారు. అలాగే తన బుల్లి మనవరాలకు ఓ స్పెషల్ గిఫ్ట్ ను కూడా పంపారట.

ప్రత్యేకంగా ఒక అందమైన గోల్డ్ చైన్ ను తయారు చేయించి తన తరుపున పాప మెడలో వేయాలని పంపించారట. పవన్ కళ్యాణ్ తరుపున వచ్చిన ఈ స్వీట్ సర్ ప్రైజ్ ని చూసి రామ్ చరణ్ – ఉపాసన ఎంతో సంతోషించారట. నిజానికి రామ్ చరణ్ కు బాబాయ్‌ పవన్ కళ్యాణ్ తో ఎంతో మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ చిన్నతనం మొత్తం పవన్ కళ్యాణ్ వద్దే గ‌డిచింది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రామ్ చ‌ర‌ణ్ కూతురుకు గోల్డ్ చైన్ పంపించ‌డంతో.. బాబాయ్‌-అబ్బాయ్ అనుబంధం మ‌రోసారి హాట్ టాపిక్ అయింది.