ఆయన మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ హర్ట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఎన్టీఆర్ అన్న పేరు వినగానే మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి హీరో ఫ్యాన్ ఎన్టీఆర్ ని..ఆయన చేసే సినిమాలని ఈక్వల్ గా లైక్ చేస్తూ ఉంటారు . దానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ కావడమే అన్న సంగతి అందరికీ తెలిసిందే . కాగ రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ..ప్రజెంట్ దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు .

కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేసాడు. ఇలాంటి క్రమంలోనే తారక్ గతంలో ఓ డైరెక్టర్ అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు . మనకు తెలిసిందే తారక్ చాలా బొద్దుగా ఉండేవాడు ..ఆ టైంలోనూ సినిమాలో హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు .

అయితే ఎస్ఎస్ రాజమౌళి సింహాద్రి సినిమా తర్వాత తారక్ ను..” ఏంటి ఇలా ఉన్నావ్..? ఛండాలంగా ఉన్నావ్ ..? ముందు బరువు తగ్గు..” అంటూ మాట్లాడారని ..అప్పుడు తారక్ చాలా బాధపడ్డారని.. ఆ కోపంతోనే లావు తగ్గడానికి ప్రయత్నించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . అంతేకాదు అలా జక్కన్న చెప్పడం బట్టే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటూ కూడా ఆయనను పొగిడేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన మాటలను ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్..!!