ఆ హీరోయిన్ తో సరసాలాడుతున్న చిరంజీవి.. ఈ వయసులోను కుమ్మేస్తున్నాడుగా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు వయసుకు తగ్గ పాత్రలు ఎవ్వరూ చేయడం లేదు. చాలా బోల్డ్ గా రొమాంటిక్ రోల్స్ లో నటిస్తున్నారు. కాగా అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి . చిరంజీవి రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రెసెంట్ చిరంజీవి నటిస్తున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా లో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్రలో నటిస్తుంది.

కీర్తి సురేష్ కి భర్త పాత్రలో సుశాంత్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ లీక్ ను సోషల్ మీడియా ద్వారా లిక్ చేసే అభిమానులకు ఫుల్ హైప్ ఇచ్చేసాడు మెగాస్టార్ చిరంజీవి . ఈ సినిమాలో సంగీత్ సాంగ్ కోసం కలర్ ఫుల్ గా గ్రాండ్ గా వేసిన సెట్లో మెగాస్టార్ చిరంజీవి – తమన్నా – కీర్తి సురేష్ – సుశాంత్ ఆడి పాడి అలరించిన కొన్ని క్లిప్స్ ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు చిరంజీవి .

ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటూ వీడియో చూస్తే అర్థమయిపోతుంది. అలాగే కమెడియన్లు వెన్నెల కిషోర్- రఘుబాబు -హైపర్ ఆది -గెటప్ శ్రీను -వైవా హర్ష కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు . దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి . అయితే కొందరు మాత్రం ఈ రేంజ్ లో తమన్నతో సరసాలు ఆడుతున్నావా..? నీ వయసు ఏంటి..? అంటూ మండిపడుతున్నారు . మరోపక్క నటనకు టాలెంట్ కు వయసుకు సంబంధమేముంది ..? ఎంటర్టైన్ చేయడమే ముఖ్యం అంటూ మెగాస్టార్ కి సపోర్ట్ చేస్తున్నారు మెగా ఫాన్స్ . కాగా సంగీత్ సాంగ్ అయినప్పటికీ “జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్క “అంటూ హుషారుతించే లిరిక్స్ వినిపిస్తున్నాయి..!!