మౌనిక కొడుకంటే మంచు మనోజ్ కి ఎంత ప్రేమో చేశారా.. నువ్వు నిజంగా గ్రేట్ సామి!

మంచు మ‌నోజ్ ఇటీవ‌లె ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో మార్చి నెల‌లో మంచు మనోజ్ ఏడ‌డుగులు వేశారు. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరి పెళ్లి వైభ‌వంగా జరిగింది. ఆల్రెడీ పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే మంచు మ‌నోజ్ తో పాటు మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహ‌మే.

మంచు మ‌నోజ్ మొద‌ట ప్ర‌ణ‌తి రెడ్డిని పెళ్లి చేసుకుని.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మ‌రోవైపు మౌనిక రెడ్డి వ్యాపారవేత్త గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టిన త‌ర్వాత విడాకులు తీసుకున్నారు. అనంత‌రం మంచు మ‌నోజ్‌, మౌనిక ప్రేమ‌లో ప‌డ్డారు. అయితే పెళ్లి చేసుకునేందుకు చాలా క‌ష్టప‌డ్డామ‌ని ఇటీవ‌లో ఓ ఇంట‌ర్వ్యూలో మ‌నోజ్, మౌనిక తెలిపారు. ఇక‌పోతే మౌనిక కొడుకు ధైరవ్ ను మ‌నోజ్ త‌న సొంత బిడ్డ‌లా స్వీక‌రించాడు.

ధైరవ్ దేవుడు ప్రసాదించిన బిడ్డ, నాకు భార్యతో పాటు బిడ్డ కూడా దొరికాడని మ‌నోజ్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. ధైరవ్ కూడా మ‌నోజ్ నే త‌న తండ్రిలా భావిస్తున్నారు. ఇక త‌న‌కు ధైరవ్ అంటే ఎంత ప్రేమో, త‌మ మధ్య అనుబంధం ఎలాంటిదో తెలియజేస్తూ మనోజ్ తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో మనోజ్, ధైరవ్ తమ పెట్ డాగ్ తో క‌లిసి ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ క‌నిపించారు. ఈ వీడియోను మౌనిక షూట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ధైరవ్ ను క‌న్న బిడ్డ కంటే ఎక్కువ‌గా చూసుకుంటున్న మ‌నోజ్ పై నెటిజ‌న్లు ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. నువ్వు నిజంగా గ్రేట్ సామి.. నీ మ‌న‌సు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/Ct3KHdzAt8r/?utm_source=ig_web_copy_link