ఆదిపురుష్ దెబ్బకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఆదిపురుష్.. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైంది. కానీ, తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ఉంటుంది. రామాయణం మరియు అందులోని పాత్రలను కామెడీ చేసి చూపించారంటూ చిత్ర టీమ్ పై నార్త్ ఇండియా మొత్తం భగ్గుమంది.
సినిమాను బ్యాన్ చెయ్యాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు కొందరు బాలీవుడ్ ప్రముఖులు సైతం డైరెక్టర్ ఓం రౌత్ తో పాటు ప్రభాస్ ను కలిపి ఏకేస్తున్నారు. మొన్నామధ్య శక్తి మాన్ సీరియల్ ఫేమ్ ముకేశ్ ఖానా ఈ సినిమాని చూసి ‘ఆదిపురుష్ మూవీ టీం మొత్తాన్ని ఎండలో నిలబెట్టి తగలబెట్టాలి’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇక తాజాగా ఓ ప్రముఖ క్రికెటర్ ప్రభాస్ ని చంపడం లో తప్పు లేదు అన్న అర్థం వచ్చేలా ఓ షాకింగ్ ట్వీట్ వదిలాడు. ఇంతకీ ఆ క్రికెటర్ మరెవరో కాదు వీరేందర్ సెహ్వాగ్. రీసెంట్ గా ఆదిపురుష్ మూవీని ఆయన వీక్షించారు. అనంతరం `ఆదిపురుష్ సినిమాని చూసిన తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు బాగా అర్థం అయ్యింది` అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. సినిమా ఎంత నచ్చకపోతే మాత్రం ఇలాంటి ట్వీట్ చేయడం మరీ ఓవర్ అంటూ మండిపడుతున్నారు.