ఎక్క‌డికి వెళ్లినా అదే గోలంటూ మండిప‌డ్డ మ‌హాన‌టి.. బాగా కాలిన‌ట్లుందే!

గత కొంతకాలం నుంచి మహానటి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని తరచూ నెట్టింట‌ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు ఖండించినా ఈ వార్తలకు పులిస్టాప్ మాత్రం పడటం లేదు. మొన్నటికి మొన్న కూడా కీర్తి సురేష్ ఎవరో అబ్బాయితో క్లోజ్ గా ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్ట‌గానే.. ఆ అబ్బాయితోనే కీర్తి పెళ్లి అంటూ వార్తలు పుట్టించేశారు. అంతేకాదు, ఎక్క‌డికి వెళ్లినా పెళ్లి గురించే అడుగుతున్నారు.

దాంతో కీర్తి సురేష్ బాగా కాలింది ఏమో గానీ.. ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేసింది. తాజాగా చెన్నైలో జ‌రిగిన `మామన్నన్` సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న కీర్తి సురేష్‌.. పెళ్లి వార్త‌ల‌పై ఘాటుగా స్పందించింది. ఎక్క‌డికి వెళ్లినా పెళ్లి గోలే అంటూ ఆమె మండిప‌డింది. ఆడియో లాంచ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ ద‌గ్గ‌ర పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకోవ‌డంతో.. ఆమె ఘాటుగా బ‌దులిచ్చింది.

`నా పెళ్లి వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను. మ‌ళ్లీ మ‌ళ్లీ పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు? నా పెళ్లిపై మీకెందుకు అంత ఆసక్తి? అయినా నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తా. ప్రతి సారి పెళ్లి గురించే అడగాల్సిన అవసరం లేదు. అదే ప్రశ్నను ప‌దే ప‌దే అడుగుతూ విసిగించ‌క్క‌ర్లేదు` అంటూ కీర్తి సురేష్ తెలిపింది. మొత్తానికి ఇప్ప‌ట్లో త‌న‌కు పెళ్లి ఆలోచ‌న లేద‌ని కీర్తి సురేష్ చెప్ప‌క‌నే చెప్పేసింది. దీంతో ఈమె వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి.