నాగ చైతన్య కంటే ముందే.. సమంతను పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో లవ్ ..డేటింగ్.. ఎఫైర్ ..విడాకులు చాలా చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి.. వినిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బడా బడా స్టార్ సెలబ్రెటీస్ అందరూ వరుసగా డివర్స్ లు ఇచ్చేస్తూ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత – హీరో నాగచైతన్య విడాకులు తీసుకోవడం అభిమానులకి మింగుడు పడడం లేదు.

వీళ్ళు విడాకులు తీసుకొని ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది . అయినా సరే ఇప్పటికి ఈ జంట కలవక పోతారా..? అంటూ ఎదురు చూస్తున్నారు . అయితే సమంతను – నాగచైతన్య నాకంటే ముందే ఓ స్టార్ హీరో ప్రేమించారని ..ఆ హీరో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి . ఆ హీరో మరెవరో కాదు బొమ్మరిల్లు సినిమాతో సూపర్ స్టార్ హీరోగా మారిపోయిన సిద్ధార్ధ్.

ఈ సిద్ధార్ధ్ ఎంతమంది హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ నడిపాడో ఆయనకే తెలియదు అంటుంటారు జనాలు. అలాంటి సిద్దు మాటల గారడీకి సమంత కూడా పడిపోయింది . వీళ్ళిద్దరూ కలిసి కాళహస్తి గుడిలో పూజలు చేసిన ఫొటోస్ కూడా పబ్లిక్ గా వైరల్ అయ్యాయి . ఇలాంటి క్రమంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి . ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట తర్వాత దూరం అయిపోయింది . ఆ తర్వాత సమంత -చైతన్యకు దగ్గర అవ్వడం.. పెళ్లి చేసుకోవడం.. ఆయనకి కూడా దూరం అవ్వడం చకచకా జరిగిపోయాయి..!!