ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో..మరోసారి ప్రూవ్ చేసుకున్న అనుష్క శెట్టి.. ఫ్యాన్స్ ఫిదా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ – హీరోయిన్ అనుష్క శెట్టిల మధ్య నడుస్తున్న ప్రేమాయణం అనే చెప్పాలి . వీళ్ళ మధ్య ప్రేమ ఉందో..? లేదో..? పుడుతుందో..? పుట్టి చచ్చిపోయిందో ..? తెలియదు కానీ వీళ్ళు పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది మాత్రం కోట్లాదిమంది అభిమానుల కల . అది నెరవేరుతుందో కల కలగానే మిగిలిపోతుందో త్వరలోనే తేలిపోనుంది. అయితే అనుష్క మాత్రం చాలా సార్లు తనకు ప్రభాస్ పై ఉన్న ఇష్టాన్ని ప్రేమని పలు రకాలుగా వ్యక్తపరుస్తూనే ఉంది.

కాగ రీసెంట్గా మరోసారి అనుష్క చేసిన పని ప్రభాస్ అంటే ఆమెకు ఎంత ఇష్టమో తెలియజేసేలా చేసింది . సోషల్ మీడియాలో ప్రజెంట్ అందరూ ఆది పురుష్ సినిమాని ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు తెలిసిందే. రాముడు గా ప్రభాస్ పనికిరాడు అంటూ బూతులు తిడుతున్నారు . అయితే ఇలాంటి ట్రోలింగ్ అనుష్క కంటపడడంతో అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేసిందట . ఆది పురుష్ లాంటి సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలి ..డేర్ ఉండాలి అన్ని .. అప్పుడే ఆ హీరోగా ఆ పాత్ర చేయగలం .

అవన్నీ కలగాల్సిన హీరోనే ప్రభాస్ ..నిజానికి రాముడు పాత్రలో ప్రభాస్ చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. మరి ఎందుకు అందరూ ఇలా ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు . అలా ట్రోల్ చేసే వాళ్ళు ఒక్కసారి ఆ పాత్ర పోషించి చూస్తే వాళ్లకే తెలుస్తుంది.. ఆ కష్టమేమిటో అంటూ ప్రభాస్ ని వెనకేసుకొస్తూ ట్రోల్ చేసే వాళ్లకు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చేసింది అనుష్క శెట్టి . దీంతో మరోసారి వీరిద్దరి ప్రేమాయణం వైరల్ గా మారింది..!!