లియో మూవీ తెలుగు రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ లియో.. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించడం జరిగింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ యూనివర్స్ ల్ మూవీస్ లో భాగంగానే ఈ చిత్రం కూడా తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికీ లోకేష్ డైరెక్షన్ లో ఖైదీ ,విక్రమ్ సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు లియో కథకు కూడా ఈ సినిమాలకు లింక్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Leo first look: Poster of Lokesh Kanagaraj film released on Vijay's  birthday - Hindustan Times
విజయ్ కెరియర్ లోనే లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈరోజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం లియో చిత్ర నిర్మాత భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రైట్స్ కోసం భారీగానే పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఎందుకంటే గతంలో లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్ విక్రమ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.

Leo director Lokesh Kanagaraj says he has no plans to stay in film industry  for long: 'I will do 10 movies and quit' | Entertainment News,The Indian  Express

దీంతో ఇప్పుడు తెలుగు లియో సినిమా కోసం ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. చివరిగా విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారీసు సినిమాలో నటించారు.ఈ సినిమా తెలుగు బిజినెస్ కూడా ఈ స్థాయిలో జరగలేదు. కానీ లియో సినిమాకు ఇంత భారీ డిమాండ్ రావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ లోకేష్ కనకరాజు అని చెప్పవచ్చు. లియో మూవీ దసరాకి విడుదల కాబోతోంది. ఇక దసరాకి బాలయ్య మూవీ రవితేజ మూవీలు విడుదల కాబోతున్నాయి మరి ఏ మేరకు లియో సినిమా సక్సెస్ అందుకుంటుందో చూడాలి.