రాజమౌళి ఆ స్టార్ కమెడియన్ దగ్గర అసిస్టెంట్ గా చేశారా..!!

టాలీవుడ్ లో రాజమౌళి చేసే సినిమాలన్నీ కూడా తన పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి.. మొదట చిన్న చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు చేస్తూనే పైకి ఎదిగి వ్యక్తి రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన డైరెక్టర్గా పేరు సంపాదించారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్లారు.. ఆ తరువాత ఆర్ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్నరు. అంతటి ఘనవిజయాలను సాధించి సినిమాలను తీసిన దర్శక ధీరుడు రాజమౌళి.

ఇక బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 తో ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు.అయితే మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా మొదలుపెట్టిన రాజమౌళి..ఆ తరువాత RRR సినిమా వరకు అన్ని ఘన విజయాలనే సాధించాడు.అయితే ఇది కాస్త పక్కన పెడితే రాజమౌళి కమెడియన్ వేణుమాధవ్ కు ఒకప్పుడు అసిస్టెంట్ గా చేశారని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

రాజమౌళి వేణుమాధవ్ కు అసిస్టెంట్ గా పని చేయటం ఏంటి..? అని అనుకుంటున్నారా.. ఇది నిజజీవితంలో కాదు నితిన్ నటించిన సై సినిమాలో రాజమౌళి వేణుమాధవ్ అసిస్టెంట్ గా కనిపించారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ సినిమాలో వేణుమాధవ్ నల్ల బాలు పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో రాజమౌళి చిన్న పాత్రలో కనిపించారు.

Interesting Bond Between Rajamouli and Comedian Venu Madhav From Sye Movie  Nalla Balu Scene |CineOne - YouTube

ఈ సినిమాలో వేణుమాధవ్ దగ్గర పనిచేసే వ్యక్తిగా కనిపించారు జక్కన్న. సై సినిమాలోనే కాకుండా ఇతర సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో కనిపించి మెప్పించారు. అయితే జక్కన్న కి ఏది పట్టినా బంగారంలా మారిపోయింది. ఇప్పట్లో ఆయన ఏ సినిమా తీసిన అది సెన్సేషనల్ హిట్ ను సాధిస్తోంది. తాన తదుపరిచిత్రం మహేష్ తో తెరకెక్కించనున్నారు.