రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా `ఇదిపురుష్` జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇందులో జంటగా నటిస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్, దేవదత్తా నాగె, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. పైగా విడుదలైన నాటి నుంచి ఈ మూవీ ఎన్నో విమర్శలు, మరెన్నో ట్రోల్స్ జరుగుతున్నాయి. అయినాసరే ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. విడుదలైన మూడో రోజుకే 300 కోట్ల క్లబ్ లో చేరిపోయి చరిత్ర సృష్టించింది.
తెలుగు రాష్ట్రాలో తొలి రోజు రూ. 32 కోట్లు, రెండో రోజు రూ. 15 కోట్లకు పైగా షేర్ ను సొంతం చేసుకున్న ఆదిపురుష్.. మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో ఏకంగా రూ. 17.07 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 151.60 కోట్లు రాబట్టింది. ఇక ఏరియాల వారీగా ఆదిపురుష్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 29.77 కోట్లు
సీడెడ్: 7.49 కోట్లు
ఉత్తరాంధ్ర: 8.30 కోట్లు
తూర్పు: 4.81 కోట్లు
పశ్చిమ: 3.45 కోట్లు
గుంటూరు: 5.83 కోట్లు
కృష్ణ: 3.55 కోట్లు
నెల్లూరు: 1.75 కోట్లు
————————————————-
ఏపీ+తెలంగాణ= 64.95 కోట్లు(103.30కోట్లు~ గ్రాస్)
————————————————-
కర్ణాటక: 10.15 కోట్లు
తమిళనాడు: 1.95 కోట్లు
కేరళ: 0.65 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 54.80 కోట్లు
OS – 19.10 కోట్లు
—————————————————
వరల్డ్ వైడ్ కలెక్షన్= 151.60 కోట్లు(302.50 కోట్లు~ గ్రాస్)
—————————————————
కాగా, 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆదిపురుష్.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ 3 డేస్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 90.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వర్కింగ్ డేస్ లో ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.