స్టార్ హీరోల పైన నిషేధం .. షాక్ లో ఫ్యాన్స్..!!

ఎంతోమంది హీరో హీరోయిన్లను యాక్టర్స్ ను సైతం కొన్ని సినీ ఇండస్ట్రీలో రెండు మూడేళ్లు నిషేధిస్తూ ఉంటారు. ఇలాంటివి ఏ ఇండస్ట్రీలో నైనా ఉండనే ఉంటాయి ఇప్పుడు తాజాగా తమిళ హీరోలకు నిర్మాత మండలి ఒక్కసారిగా జలక్ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఏకంగా ఐదు మంది హీరోలకు రెడ్ కార్డు ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. వేరువేరు సినిమాలకు అడ్వాన్స్ తీసుకొని తమ డేట్స్ లను సరిగ్గా ఇవ్వలేకపోవడంతో కొంతమంది నిర్మాతలు కౌన్సిలర్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.

Vishal-Hari film to start rolling in June; Yogi Babu roped in for project

దీంతో నిర్మాత మండలి వారు హీరో విశాల్, శింబు, అధర్వ ఎస్ జె సూర్య, యోగి బాబులకు రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాతలకు సహకరించని ఈ ఐదుగురు ప్రముఖ నటులకు రెడ్ కార్డు ఇవ్వాలని తమిళ నిర్మాత సంఘం నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.విశాల్, శింబు, అధర్వ ఎస్ జె సూర్య, యోగి బాబు తదితర ప్రముఖ నటుల సినిమాలకు సహకరించకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది నటీనటులు సంఘం నుండి వివరణ కోరాలని తెలియజేసినట్టుగా సమాచారం.

Will actors Simbu, SJ Suryah, Vishal, Atharva, and Yogi Babu face a "red card"? - Tamil News - IndiaGlitz.com
అయితే వారి ఇచ్చే సమాధానాన్ని బట్టి వీరి పైన తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయాన్ని తీసుకున్నట్టు నిర్మాత మండలి వారు తెలియజేశారు. ఈ ఐదుగురు నటులలో నిర్మాత ఈసారి గణేష్ సంస్థ నుండి అడ్వాన్స్ తీసుకొని కాల్ సీట్లు ఇవ్వని హీరో శింబు రెడ్ కార్డు వేయాలని నిర్ణయించుకున్నది.. గ్రీన్ స్టూడియో కి కాల్ షీట్స్ ఇవ్వని విశాల్ కు, అలాగే ఎస్ జె సూర్య, అధర్వ పైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. డిస్ప్లే లేని కారణంగా కూడా ఈ కార్డుని వాడుతారని సమాచారం. దీంతో ఈ విషయం విన్న అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరి ఈ విషయంపై హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.