ఎన్టీఆర్‌31 పై మరో పిచ్చెక్కించే క్రేజీ రూమర్‌.. నిజమైతే నందమూరి అభిమానులకు మెంటల్ ఎక్కిపోద్ది..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “దేవర”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రెసెంట్ రన్ అవుతుంది. సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ కి సంబంధించిన కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . కాగా ఇదే క్రమంలో ఎన్టీఆర్ తర్వాత సినిమాకి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి .

కాగా కే జి ఎఫ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేతులు కలిపిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేసేది ఆయనే. ప్రశాంత్ నీ ఎన్టీఆర్కు జోడిగా గ్లోబల్ బ్యూటి ప్రియాంక చోప్రను ఫిక్స్ చేసుకున్నారు . ఇదే న్యూస్ ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది. అయితే కేవలం ఈ సినిమాలో ఈ బ్యూటీనే కాదు.. మరో బ్యూటీ కూడా ఉంది అన్న వార్త ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .

ఆ మేడం మరెవరో కాదు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ . రీసెంట్ గా పోనియన్ సెల్వన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఐశ్వర్య.. ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించబోతుందట . ఫర్ ద ఫస్ట్ టైం ఎన్టీఆర్ సినిమాలో ఓ లేడీ విలన్ గా నటించబోతుంది . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు అభిమానులు. మరి ముఖ్యంగా అంత అందాల ముద్దుగుమ్మను ఎలా నెగటివ్ షేడ్స్ లో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!