విడాకుల విష‌యంలో స‌మంత‌ను ఏకేసిన నెటిజ‌న్లు.. అదే క‌రెక్ట్ అంటూ అమ‌ల షాకింగ్ కామెంట్స్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత విడాకులు ఎంత‌టి సెన్సేష‌న్ ను క్రియేట్ చేశాయో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని.. 2017లో ఏడడుగులు వేసిన ఈ జంట వివాహం అనంత‌రం నాలుగేళ్లు కూడా క‌లిసి ఉండ‌లేక‌పోవ‌డాన్ని అక్కినేని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోయారు. వీరిద్ద‌రూ త‌మ విడాకులను అనౌన్స్ చేసిన రోజు.. సినీ ప్ర‌ముఖులు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు.

అయితే విడాకులు విష‌యంలో చాలా మంది నెటిజ‌న్లు స‌మంత‌నే ఓ రేంజ్ లో ఏకేశారు. స‌మంత‌దే త‌ప్పు అన్న‌ట్లుగా దారునంగా ట్రోల్ చేశారు. మ‌రికొంద‌రైతే బండ బూతులు కూడా తిట్టారు. అయితే నెటిజ‌న్ల తీరు క‌రెక్ట్ అన్న‌ట్లు తాజాగా అమ‌ల అక్కినేని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆమె.. అనేక విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే విడాకులు స‌మ‌యంలో సమంత మరియు నాగ చైతన్య మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ పై అమ‌ల స్పందించింది.

సెలబ్రిటీ జీవితం అన్న తర్వాత మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. దానిని మనం మార్చలేము. ఆప‌లేము. ఇక‌ నాగ చైతన్య-సమంత విడాకులేమి ర‌హ‌స్యంగా జరగలేదు. పబ్లిక్ గానే జరిగింది. అందువ‌ల్ల నెటిజెన్స్ అభిప్రాయాలను స్వీకరించాల్సిందే. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను నేను స్వాగతిస్తున్నాను` అంటూ అమ‌ల చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.