రామ్ చ‌ర‌ణ్ కు మ‌రో పేరు ఉందా.. టాప్ సీక్రెట్ ను లీక్ చేసిన నిహారిక‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భ‌ర్త పోస్ట్ నుంచి తండ్రి పోస్ట్ కు ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. అది కూడా ఉపాస‌న‌తో పెళ్లి జ‌రిగిన 11 ఏళ్ల‌కు. గ‌త ఏడాది గ‌ర్భం దాల్చిన ఉపాస‌న జూన్ 20వ తేదీన పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. నిన్న హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాస‌న దంప‌తులు బిడ్డ‌తో క‌లిసి ఇంటికి కూడా వెళ్లారు.

మెగా లిటిల్ ప్రిన్సెస్ రాక‌తో మెగా ఫ్యామిలీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల త‌న అన్న రామ్ చ‌ర‌ణ్, వ‌దిన ఉపాస‌న పేరెంట్స్ కావడంపై స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ క్ర‌మంలోనే రామ్ చ‌ర‌ణ్ కు మ‌రో పేరు ఉందంటూ టాప్ సీక్రెట్ ను లీక్ చేసింది. రామ్ చరణ్ అన్న తండ్రి కాబోతున్నాడు అనే వార్త తెలిసినప్పటి నుంచి అంద‌రం ఎంతో ఎగ్జైట్ అయ్యామ‌ని.. పాప రాక తో ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింద‌ని నిహారిక చెప్పుకొచ్చింది.

అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన కజిన్స్ అందరిని చరణ్ అన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటాడ‌ని.. అందుకే తామందరం కూడా అన్నను `బాపూజీ` అని పిలుచుకుంటామ‌ని నిహారిక పేర్కొంది. ఇక వదిన ఉపాసన ఎంతో సమర్థురాలు అందరికి తెల్సిందే. అలాంటి వారిద్ద‌రికీ పుట్టిన పాప ఫ్యూచ‌ర‌ల్ ఖ‌చ్చితంగా ఉన్న‌త స్థానంలో నిల‌బ‌డుతుంద‌ని నిహారిక చెప్పుకొచ్చింది. మొత్తానికి మెగా లిటిల్ ప్రిన్సెస్ వ‌చ్చింద‌న్న ఎగ్జైట్‌మెంట్‌తో నిహారిక‌.. రామ్ చ‌ర‌ణ్ కు ఉన్న మ‌రో పేరును రివీల్ చేసేసింది. అన్న‌ట్లు నిహారిక భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఆల్మోస్ట్ వీరి విడాకులు క‌న్ఫార్మ్ అయిపోయాయి. ప్ర‌స్తుతం నిహారిక నిర్మాత‌గా, న‌టిగా సత్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.