ఫ్లాప్ హీరోయిన్ పై మోజు పడుతున్న స్టార్ హీరోలు.. అమ్మడులో అంత మ్యాటర్ ఉందా..?

ఏంటో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. పొరపాటున తప్పులు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ చేతికి అడ్డంగా దొరికిపోతున్నారు . కాగా రీసెంట్ గానే టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే కోసం వరుస ప్లాపుల్లో అల్లాడిపోతున్న ఆమెకు లైఫ్ ఇవ్వడానికి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే .

అయితే ఇప్పుడు రీసెంట్గా అదే లిస్టులోకి మరో స్టార్ హీరో కూడా చేరిపోయినట్లు తెలుస్తుంది. ఎస్ కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కార్తీ కూడా తన నెక్స్ట్ సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం బుట్ట బొమ్మ చేతిలో ఉండేది ఒక్కటంటే ఒక్క సినిమానే . అది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ” గుంటూరు కారం “.

ఈ సినిమాలో శ్రీలీల కూడా నటిస్తూ ఉండడంతో పూజ హెగ్డే పై పెట్టుకున్న ఆశలన్నీ తగ్గిపోయాయి . అయితే ఇలాంటి క్రమంలోనే పూజాకి ఇక ఆఫర్స్ రావని దుకాణం సర్దుకోవచ్చని అనుకుంటున్న టైంలో పూజా హెగ్డే కు బన్నీ – కార్తీ లాంటి స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తూ ఉండడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. కాగా కార్తీ తన నెక్స్ట్ సినిమాలో పూజకు ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!