బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి బాలకృష్ణ ‘నటసింహం’ కాదు.. కొత్త బిరుదు వచ్చేసిందోచ్..కేకో కేక..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో యమ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు టాలీవుడ్ హీరో బాలకృష్ణ అంటే ముందుగా అందరికీ వినిపించేది “నటసింహం” బాలయ్య . ఈ బిరుదుతోనే ఇన్నాళ్లు బాలయ్య ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ ఆ బిరుదు ని మార్చేస్తున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .


నందమూరి తారకరామారావుగారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య ..మొదట ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకొని యువరత్న అనే బిరుదును సంపాదించుకున్నాడు. అయితే చాలా కాలం వరకు అదే బిరుదుతో కొనసాగిన బాలయ్య సమరసింహారెడ్డి – నరసింహనాయుడు వంటి సినిమాలతో ” సింహ గర్జన” చేసి “నటసింహంగా” పేరు సంపాదించుకున్నారు . అప్పటినుంచి బాలయ్యను అందరు నట సింహం నటసింహం అంటూ పిలుస్తూ వచ్చారు. అయితే రీసెంట్గా ఆ బిరుదుని చేంజ్ చేశారు అభిమానులు .

ఇప్పుడు అదే న్యూస్ వైరల్ గా మారింది. ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త బిరుదుని ఇంట్రడ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో సరికొత్త హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే కాదు గ్లోబల్ వైడ్ సింహం అనే టాగ్ ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం బాలయ్యకి “గ్లోబల్ లయన్ ” అనే బిరుదును అభిమానులు ఇస్తున్నారట . ఇదే న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు టాలీవుడ్ లోని ప్రేక్షకుడు కూడా ఈ బిరుదుని కాదనలేకపోతున్నారు . “గ్లోబల్ లయన్” అనే బిరుదుకు బాలయ్య ది పర్ఫెక్ట్.. గ్లోబల్ స్ధాయి కోసం కష్టపడకుండానే గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యకు ఇంతకంటే అభిమానులు ఎలా బర్త డే విషెస్ చెప్పగలరు ..!!