ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే “ఆదిపురుష్” సినిమా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “ఆది పురుష్”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
ఇక సకల సుగుణాభిరాముడు కథని చూడలేని వారికి చూపించాలని కొంతమంది సెలబ్రిటీస్ తాపత్రయ పడుతున్నాడు . ఈ క్రమంలోనే కార్తికేయ టు ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ..అనాధ శరణాలయాలకు ..వృద్ధ ఆశ్రమాలకు 10,000 టికెట్స్ కొని ఫ్రీగా డొనేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రన్బీర్ కపూర్ సైతం ఏకంగా 10,000 టికెట్స్ బుక్ చేసి నార్త్ లోని.. పలు ప్రాంతాలలో పేద పిల్లలకు ఈ టికెట్స్ డొనేట్ చేయడానికి నిర్ణయించుకున్నారట.
ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . ఆది పురుష్ సినిమాను చూడడానికి ఇంతమంది ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది . అంతేకాదు ఈ సినిమాలో కృతి సనన్ సీత దేవిగా కనిపిస్తూ ఉండగా .. సైఫ్ అలీ ఖాన్ రావణాసుడిగా కనిపించబోతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!