ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోతున్న నటి పూర్ణ!

టాలీవుడ్ నటి పూర్ణ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవిబాబు దర్శకత్వంలో అవును అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ తరువాత తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తరువాత చక్కటి హోమ్లీ పాత్రలలో పూర్ణ నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా వున్న ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగానే కాకుండా బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా సత్తా చాటుతున్నారు. కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్న పూర్ణ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో ప్రసవించారు. దీంతో ఆమె మరలా కొంచెం గ్యాప్ తీసుకొని తిరిగి బిజీ అయ్యారు. ఢీ సీజన్ 16 జడ్జిగా వ్యవహరించనున్నారు. అలాగే పలు చిత్రాల్లో కీలక రోల్స్ లో కనిపిస్తున్నారు.

ఆమధ్య నాని హీరోగా వచ్చిన దసరా సినిమాలో ఆమె ఓ మంచి పాత్రను పోషించింది. గత ఏడాది పూర్ణ దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే వారి వివాహానికి హాజరయ్యారని పూర్ణ ఆమధ్య వెల్లడించారు. ఇక ఇండియాలో ఉన్న బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ తన కెరీర్ కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తున్నారు.

గత ఏడాది పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలై మంచి ఫలితాన్నే దక్కించుకుంది. మొదట్లో పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఇకపోతే పూర్ణ హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన తరువాత క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటిగా బుల్లితెర జడ్జిగా సత్తా చాటుతున్నారనే విషయం అందరికీ తెలిసినదే.