పుష్ప -2 లో స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా విడుదలై పాన్ ఇండియా లేవల్లో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాయి ముఖ్యంగా ఇందులో ఐటెం సాంగ్ కు సమంత డాన్స్ వేయడంతో మరింత పాపులారిటీ సంపాదించింది. ఈ పాట ఇప్పటికి వెండితెర పైన అలరిస్తూనే ఉంది.

భారీ అంచనాల మధ్య చిత్రీకరిస్తున్న పుష్ప -2 చిత్రం మొదటి భాగాన్ని మించి ఉండబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఒక చిన్న గ్లింప్స్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక అప్డేట్ వైరల్ గా మారుతుంది పుష్ప -2 చిత్రంలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తారనే విషయంపై పెద్ద చర్చ జరుగుతూనే ఉన్నది. తాజాగా ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతుంది రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సిరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే..ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ ని హగ్గు చేసుకుని ఒక ఫోటోని తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది.. అలాగే ఎదగడానికి డాన్సర్లకు రెక్కలు అవసరం లేదు అది తెలుసుకున్న వారి కి వారి ఎనర్జీ దారి చూపుతుంది అంటూ అల్లు అర్జున్ ట్యాగ్ చేసింది. ఈ సందర్భంగా పుష్ప-2 చిత్రంలో కచ్చితంగా ఈమె ఐటెం సాంగ్ లో నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

Share post:

Latest