కమెడీయన్ పృధ్విరాజ్.. పొలిటికల్ ఎంట్రీ కుటుంబానికి ఇష్టం లేదా..?

టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్విరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు. గతంలో వైసిపి నుంచి పదవి పొందిన పృథ్విరాజ్ కొన్ని కారణాలవల్ల ఆ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పృథ్వీరాజ్ కూతురు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో నటిస్తోంది. ఇందులో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం..

పృధ్విరాజ్ కూతురు మాట్లాడుతూ తన తండ్రి రాజకీయాలలో చేయడం తనకు నచ్చదని అంతేకాకుండా తన కుటుంబానికి కూడా నచ్చలేదని తెలిపింది. పృథ్వీరాజ్ కూతురు పేరు శ్రీలు.. ప్రస్తుతం మేము కొత్త రంగుల ప్రపంచమని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ చిత్రానికి పృధ్విరాజ్ డైరెక్టర్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సినిమాలోని పాత్రకు పూర్తి న్యాయం చేయగలనని భావించి తన తండ్రి తనకు అవకాశం ఇచ్చారని తెలియజేస్తోంది శ్రీలు. ఒక యాక్టర్ గా తన తండ్రి అంటే చాలా ఇష్టమని తను ఎన్నో రోల్స్ నటించి ప్రేక్షకులను బాగా నవ్వించారు..

Prudhviraj Family Wife Biography Parents children's Marriage Photos
తన తండ్రి మాత్రం రాజకీయాలకు అసలు సూట్ కారని రాజకీయాల్లోకి వెళ్ళవద్దని ఎన్నోసార్లు కుటుంబమంతా కలిసి చెప్పాము.. అయితే నాన్నకు రాజకీయాల పైన విపరీతమైన ఇష్టం ఉండడంతో ఆయన ఎవరి మాట వినకుండా రాజకీయాలలోకి వెళ్లారని తెలుపుతోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు తన తండ్రి మాత్రం ఒకే విషయాన్ని చెప్పారు ఇండస్ట్రీలో ముందు వెనుక జరిగే విషయాలను అసలు పట్టించుకోవద్దని చెప్పారట. కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లాలని సలహా ఇచ్చారని తెలిపింది. ప్రస్తుతం శ్రీలు చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest