ఐశ్వర్యరాయ్ ఎన్ని కోట్లకు అధిపతి రాలో తెలుసా..?

ఇండియన్ ఫిలిం యాక్టర్ ఐశ్వర్యరాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నార్త్ టు సౌత్ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఐశ్వర్యరాయ్ ఇప్పుడు సినిమాలను పూర్తిగా తగ్గించేసింది కేవలం తన పాత్రకు తగ్గ ఉండే పాత్ర గల సినిమాలలో నటిస్తూ వస్తోంది. చివరిగా ఈమె నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించారు.

Aishwarya Rai's 'Family Time' With The Bachchan Brigade Will Make You  Instantly Crave For Same This Weekend! | India.com

ఐశ్వర్యారాయ్ కెరియర్ బాగా సాగుతున్న సమయంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చ కుమారుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య బచ్చన్ అనే కూతురు కూడా కలదు. ఇదంతా ఇలా ఉంటే ఒకప్పుడు ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ కూడా ఒకరు దాదాపుగా మూడు దశాబ్దాల పాటు తన కెరియర్లో ఎన్నో చిత్రాలు నటించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించి అంతర్జాతీయ బ్రాండ్లకు కూడా ప్రమోషన్ చేసింది ఐశ్వర్యరాయ్.

బలురకాల బిజినెస్ల్లో కూడా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క చిత్రానికి రూ.12 కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ వద్ద దాదాపుగా రూ.800 కు పైగా కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ తన కుటుంబంతో కలిసి ముంబైలో జుహు పరిసర ప్రాంతాలలో విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భవనం ఖరీదు రూ .100 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా పలుచోట్ల ఇళ్ళతోపాటు పొలాలు అపార్ట్మెంట్లు.. కార్లు, బైక్స్ అన్ని కలుపుకొని దాదాపుగా రూ .800 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లు సమాచారం. అయితే ఇది కేవలం ఐశ్వర్యరాయ్ తన భర్త ప్రాపర్టీ అన్నట్లుగా సమాచారం.

Share post:

Latest