అందరినీ నవ్వించే శాంతి స్వరూప్ జీవితంలో ఇంతటి విషాదాలా..!!

జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కమెడియన్లు మంచి పాపులారిటీ సంపాదించారు అలాంటి వారిలో శాంతి స్వరూప్ కూడా ఒకరు. లేడీ కమెడియన్ గెటప్పులో అదరగొట్టేస్తూ ఉంటారు శాంతి స్వరూప్.. ముఖ్యంగా వీరి కామెడీ టైమింగ్ కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పవచ్చు.. మదర్స్ డే సందర్భంగా ఒక ఈవెంట్ ఈనెల 14వ తేదీన ప్రసారం కాబోతోంది. ఈ ఎపిసోడ్ కు రాశి స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది. ఈ ప్రమోలు మానసి విష్ణు ప్రియ తో మాట్లాడుతూ ఈరోజు మదర్స్ డే కదా మీ అమ్మని ఎంత మిస్ అవుతున్నావో నాకు తెలుసు అంటూ తెలియజేశారు.

అందుకోసమే మన ఆర్టిస్టులు అందరిని వాళ్ళ ఫ్యామిలీలతో పాటు ఇక్కడికి గెట్ టు గెదర్లాగా నీకోసం అని ఆర్గనైజ్ చేశానని మానస్ కామెంట్లు చేయడం జరిగింది .. హ్యాపీ మదర్స్ డే విష్ణు ప్రియ అంటూ మానస్ తెలియజేశారు. బుల్లెట్ భాస్కర్ తన తల్లికి బంగారు గొలుసు ఇవ్వగా.. దీంతో తల్లి ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇలాంటి కొడుకు పుట్టారు అంటూ తెలిపింది శాంతి స్వరూప్ మాట్లాడుతూ మా అమ్మ ఇళ్లల్లో పాచి పని చేసి ఈ రోజు ఇస్తాయికి తీసుకువచ్చారని తెలిపింది. అంతేకాకుండా తినడానికి తిండి లేని సమయంలో కూడా మా కోసం తను పస్తులు ఉంది.. ఇలా ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు శాంతి స్వరూప్.. తనకు జబర్దస్త్ లేకపోతే ఇలాంటి గుర్తింపు లేదని తెలియజేసింది.

ఇక విష్ణు ప్రియ తన తల్లి గురించి మాట్లాడుతూ ఎంత అడిగినా మా అమ్మ రాదు ..అమ్మ ఐ లవ్ యు మిస్ యు అంటూ విష్ణు ప్రియ ఎమోషనల్ కావడం జరిగింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించి ఒక ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest