మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి తండ్రి..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతో పాటు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తున్నారు.. దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.ఈ సినిమా భారీ అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

Mahesh Babu to begin SS Rajamouli's film in 2023, reveals KV Vijayendra  Prasad - India Today

ఇక ఈ సినిమా గురించి పలు రకరకాలుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు రాకపోయినా పలు రకాల ఊహాగానాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ హనుమంతుడి తరహాలో ఉంటుందని న్యూస్ వైరల్ గా మారుతోంది.. హీరోయిన్గా బాలీవుడ్ నటి నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇదంతా కేవలం రూమర్ అంటూ రాజమౌళి కాంపౌండ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుని కేఎల్ నారాయణ నిర్మిస్తూ ఉన్నారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్.. తాజాగా రాజమౌళి తండ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే ఏడాది వేసవి కంటే ముందు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి క్యాస్టింగ్ సెలక్షన్స్ లో ఉన్నారు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి మూవీ వర్క్ షాప్ జాయిన్ అవుతున్నారు సూపర్ స్టార్ అంటూ తెలిపారు.

Share post:

Latest