రేయ్ థమన్ గా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్లు.. ఏంటీ `బ్రో` మ‌ళ్లీ కాపీయేనా?

ఎస్. ఎస్. థ‌మ‌న్‌.. సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ ఒకడు. కానీ, కెరీర్ ఆరంభం నుంచి థ‌మ‌న్ `కాపీ క్యాట్‌`అనే ట్యాగ్ ను మోస్తూనే ఉన్నాడు. పాప్, విదేశీ ట్యూన్లను కాపీ కొడుతున్నారనే ఆరోపణలు థ‌మ‌న్‌పై ఉన్నాయి. పలు ట్యూన్లు కూడా అందుకు సాక్ష్యంగా నిలిచాయి. దాంతో అతడు కంపోజ్ చేసిన అన్ని సినిమాల్లో ఏదో ఒక పాట కాపీయే అన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా థ‌మ‌న్ మ‌రోసారి అడ్డంగా బుక్కైయ్యాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో`. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కోలీవుడ్ లో డైరెక్ట్ చేసిన స‌ముద్ర‌ఖ‌నినే తెలుగులోనూ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్ అందిస్తుంటే.. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు.

అయితే నిన్న ఈ మూవీ టైటిల్ ను అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన చిత్ర‌టీమ్‌.. థీమ్ సాంగ్ కూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ థీమ్ సాంగ్ ఎంత‌లా ఆక‌ట్టుకుంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ థీమ్ సాంగ్ కు థ‌మ‌న్ అందించిన బీజీఎమ్ ఆహా.. ఓహో.. అంటూ పొగిడేశారు. కానీ, ఇప్పుడు ఈ సాంగ్ ను కూడా థ‌మన్ కాపీ చేశాడంటూ ట్రోలింగ్ జ‌రుగుతోంది. అక్షయ్ కుమార్ బ్లూ మూవీలో నుంచి ఈ బ్రో సాంగ్ కాపీ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఆ సాంగ్ లో ఉన్న బ్లూ అనే పదాన్ని తీసేసి బ్రో పెట్టడం తప్ప మిగతా మార్పులేమీ లేవని.. మక్కీకి మక్కీ దింపేశాడ‌ని ఆరోపిస్తున్నారు. రేయ్ థ‌మ‌న్ గా మ‌ళ్లీ కాపీయేనా అంటూ ఏకేస్తున్నారు.

Share post:

Latest